Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News ఐరన్ డోమ్‌పై హెజ్‌బొల్లా దాడి వీడియో విడుదల..

ఐరన్ డోమ్‌పై హెజ్‌బొల్లా దాడి వీడియో విడుదల..

by CVR NEWS
ఐరన్ డోమ్‌పై హెజ్‌బొల్లా దాడి వీడియో విడుదల

ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణవ్యవస్థను హెజ్‌బొల్లా చాకచక్యంగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దులో మోహరించిన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థను కొన్నాళ్ల క్రితం హెజ్‌బొల్లా లక్ష్యంగా చేసుకొంది. దీనిని ధ్వంసం చేసేందుకు ఫస్ట్‌పర్సన్‌ వ్యూ డ్రోన్‌ను ప్రయోగించింది. ఈ డ్రోన్లు చాలా చిన్నవిగా ఉండటంతో ఐడీఎఫ్‌ కూడా వీటిని కూల్చేందుకు ఇబ్బందిపడింది. ఈ డ్రోన్లకు ప్రత్యేక కేబుల్స్‌ ఉండటంతో.. ఇజ్రాయెల్‌ జామింగ్‌ టెక్నాలజీకి ఇవి లొంగలేదు. ఇలాంటి డ్రోన్‌ ఒకటి ఐరన్‌ డోమ్‌ బ్యాటరీని తాకింది. కొన్నాళ్ల నుంచి ఐడీఎఫ్‌ కూడా ఎఫ్‌పీవీ డ్రోన్లతో సమస్యలను తట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఎయిర్‌ డిఫెన్స్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ రాన్‌ కోచవ్‌ డ్రోన్ల ముప్పుపై హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

023971
Total views : 143650

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.