Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ..

గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ..

by CVR NEWS
గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా తో సమావేశం కానున్నారు. ఇవాళ 8 గంటలకు ఆయన లోక్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా జరిగే మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పెండింగ్‌లో ఉన్న కీలక ఫైళ్ల గురించి గవర్నర్‌కు సీఎం వివరించే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లుల గురించి ప్రాథమికంగా చర్చిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: