Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ

నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ

by CVR NEWS

నేపాల్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్‌ సూచనల మేరకు ఆర్టీజీఎస్‌ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్‌ యాత్రకు వెళ్లిన బృందం ఖాట్మాండులోని హోటల్‌లో సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఏపీ భవన్‌, విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం, నేపాల్‌, చైనా అధికారులతో సమన్వయం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. యాత్రికులు స్వస్థలాలకు చేరుకునే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: