Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home National ఆగస్టులో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్ రైళు

ఆగస్టులో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్ రైళు

by Satya
ఆగస్టులో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్ రైళు

ఆగస్టులో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్ రైళుకు రైల్వే శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. తొలి రైలును ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ – ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ నగరాల మధ్య రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలోనే నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌కు తాజాగా సూచించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు సికింద్రాబాద్ – పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు రానుంది.

తిరుపతి – నిజామాబాద్ మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్‌‌లో ప్లాట్ ఫాం ఖాళీ లేక బోధన్‌కు తరలిస్తున్నారు. ప్రయాణ సమయానికి ముందు బోధన్ నుంచి నిజామాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఇక సికింద్రాబాద్ – రాజ్‌కోట్ మధ్య రాకపోకలు సాగించే రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌లోని పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్న రాజస్థానీలకు అత్యంత అనుకూలంగా మారింది. అయితే, ఈ రైలును కచ్ జిల్లా వరకూ పొడిగించాలని హైదరాబాదీలు కోరుతున్నారు. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షలో చర్చకు రావడంతో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌ వరకూ, రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను కచ్ వరకూ పొడిగించేందుకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.