పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేశారు.. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను అత్యాచారాలను నిలువరించడానికి నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు గద్దర్ పాట తెలంగాణ ప్రాంత ప్రజలను ప్రభావితం చేసిందని అన్నారు .రాబోయే తరం కూడా గద్దర్ ఆలోచనలను ముందుగా తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్క యువకులు పనిచేయాలని కోరారు .తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సాంస్కృతిక కళా రంగానికి విశిష్ట సేవలను అందించడంతోపాటు ప్రతి పల్లెలో గద్దర్ పాట ప్రజానీకాన్ని ప్రభావితం చేసిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహ ప్రతిష్టను ..ఆ తర్వాత పల్లెలలో జిల్లాలో గద్దర్ పేరిట సాంస్కృతిక కళా రంగానికి పెద్దపీట వేయాలని తెలిపారు .సాంస్కృతికల తోటి మంత్రులను సీఎం త్వరలోనే కలిసి గద్దర్ పేరుకు ఇవ్వాల్సిన అవార్డులను ఇవ్వాలని కోరారు
గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.
3.6K
previous post