Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

by CVR NEWS
మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది - కొల్లు రవీంద్ర

ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శించారు. 2019–24 మధ్య మైనింగ్ రంగ వృద్ధిరేటు గణనీయంగా తగ్గగా… తమ ప్రభుత్వం పారదర్శక విధానాలతో మైనింగ్ వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోందని వెల్లడించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ విధానాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర… అక్రమ తవ్వకాలను ఉపగ్రహ సాంకేతికతతో పర్యవేక్షించి… నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: