ప్రభుత్వ సంక్షేమ, ఉచిత పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల ప్రయోజనాలు కోటీశ్వరులు కూడా పొందుతున్న పరిస్థితి ఉందని హైకోర్టు పేర్కొంది. ముఖ్యంగా రైతుబంధు వంటి పథకాల ద్వారా ఎంతోమంది ఆర్థికంగా బలమైన వ్యక్తులు కూడా లబ్ధి పొందుతున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వ్యాఖ్యానించింది. ఇలా విచక్షణ లేకుండా ఉచిత పథకాలు అమలు చేస్తే భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వాలు ఏమి చేయగలవని హైకోర్టు ప్రశ్నించింది. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమిచ్చాం… అనే ఆలోచన ఉండేదని, ప్రస్తుతం ఈ దేశం మనకేమిచ్చింది… అనే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలని, బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజు సహాయం వంటి లక్ష్యిత పథకాలను అమలు చేయాలని హైకోర్టు సూచించింది.
ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.
17