Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Latest News నీట్ పేపర్ లీక్, అయోధ్య విరాళాల వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టు.

నీట్ పేపర్ లీక్, అయోధ్య విరాళాల వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టు.

by CVR NEWS

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసు, అయోధ్య రామాలయ విరాళాల అంశంపై ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో ఇరు సభల్లో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో లోక్‌సభలో కీలక బిల్లులకు ఆమోదం లభించగా, రాజ్యసభలో అప్రోప్రియేషన్ బిల్లు ఆమోదం పొందింది.

నీట్-యూజీ లీక్ కేసుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు, అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభలో నినాదాలు, ఆందోళనల కారణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడి, చివరకు ఇరు సభలను రోజంతా వాయిదా వేశారు.

ప్రతిపక్ష ఆందోళనల మధ్యే లోక్‌సభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెల్లింపుల ఆలస్యాన్ని తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన MSME డెవలప్‌మెంట్ సవరణ బిల్లు–2026 ఆమోదం పొందింది. చర్చ జరగకుండానే బిల్లును సభ ఆమోదించడంతో ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శల వర్షం కురిపించింది.

రాజ్యసభలో 2026 అప్రోప్రియేషన్ బిల్లు వాయిస్ ఓట్‌తో ఆమోదం పొందింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు వ్యయాల కోసం సుమారు రూ.54 వేల కోట్లకు పైగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధుల ఉపసంహరణకు ఈ బిల్లు అనుమతి ఇచ్చింది. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.

ఒకవైపు ప్రతిపక్ష నిరసనలు, మరోవైపు కీలక బిల్లుల ఆమోదంతో పార్లమెంట్‌లో రాజకీయ వేడి కొనసాగింది. వివాదాస్పద అంశాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా, రాబోయే సమావేశాల్లో FRCA సవరణ బిల్లుపై కూడా తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: