Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home International ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.

ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.

by CVR NEWS

ఇరాన్ లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో తాము చేసుకోబోయేది కేవలం అవగాహన ఒప్పందమేనని.. అది ఫైనల్‌ కాదని పేర్కొన్నారు. ఒకవేళ అందులోని అంశాలు తనకు నచ్చకపోయినా, ఇరాన్‌ తీరు సరిగ్గా లేకపోయినా.. ఆ దేశంపై మళ్లీ దాడులు చేస్తామని చెప్పారు. G7 సదస్సు నేపథ్యంలో ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేయనున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమెరికా- ఇరాన్ ఒప్పందంలో భాగంగా పునర్నిర్మాణ నిధుల కింద టెహ్రాన్‌కు 300 బిలియన్ డాలర్లు సమకూర్చే అంశం ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌కు తాము ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదన్నారు. తాము పెట్టుబడి పెట్టమని..అలాంటి ఫండ్ తమదగ్గర ఏదీ లేదని చెప్పారు. ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టాలని గల్ఫ్ దేశాలనూ కోరడం లేదని.. ఒకవేళ వారు ముందుకొస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే.. ఇరాన్‌ ధోరణి ఎలా ఉంటుందో ఒక అవగాహన వచ్చేవరకు కొంతకాలం పాటు ఆ దేశాలు అటువంటి పని చేయకపోవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: