Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

by CVR NEWS
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2023-26 మధ్య కాలంలో 1,078 కోట్ల వ్యయంతో 2 వేల 815 నూతన బస్సులను కొనుగోలు చేసిందని తెలిపారు. అలాగే ఏటూరు నాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలను మంజూరు చేశామని.. వేములవాడ, కథలాపూర్ బస్‌స్టేషన్లకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని ప్రాథమిక వైద్య సేవల స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన డబ్బులతో కోటి రూపాయల చెక్కు , ఇంట్లో ఒకరికి ఉద్యోగం , ఇందిరమ్మ ఇల్లు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025862
Total views : 149307

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.