పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక చోట్ల ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు . ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు సివిఆర్ న్యూస్ ప్రతినిధుల పరిశీలనలో బయటపడింది. లిక్కర్ బాటిళ్లపై ₹10 వరకు అదనంగా వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి . బీర్ బాటిళ్లపై ₹20 నుంచి ₹30 వరకు ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు . బిల్లు అడిగితే “మాకు తెలియదు”, “బిల్లు లేదు” అంటూ నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారు .
రాత్రి వేళల్లో కూడా అనధికారికంగా విక్రయాలు కొనసాగుతున్నాయి .గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా బెల్ట్ షాపుల ద్వారా అక్రమ అమ్మకాలు జరుపుతున్నారు .ఎక్సైజ్ శాఖ సరైన పర్యవేక్షణ చేయకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది .దింతో ఎక్సైజ్ శాఖ లోపాలు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ప్రభుత్వ నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మకపోవడంతో మందుబాబుల జేబులకు బాగానే చిల్లు పడుతుంది . ఇంకో వైపు వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ పెరుగుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో మద్యం అక్రమాలు రోజురోజుకూ పెరుగుతుండడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది . అధికారికంగా జిల్లాలో 175 బ్రాందీ షాపులు, 25 బార్లు ఉన్నప్పటికీ…ఎక్సైజ్ శాఖ నియంత్రణ మాత్రం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఎక్సైజ్ శాఖ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని చెబుతున్నా… గ్రౌండ్ లెవల్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపుల విస్తరణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా… గుడి, బడి, కాలనీలు, ప్రధాన వీధులు అన్న తేడా లేకుండా… అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు బహిరంగంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపిల్లలు తిరిగే వీధుల్లో… మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో… విద్యార్థులు వెళ్లే మార్గాల్లో కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి అక్రమాలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న.
ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్‌పై 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు అమ్మి షాప్ యజమానులు జేబులు నింపుకుంటున్నారు .
ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే… కొన్ని చోట్ల బిల్లు లేకుండానే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనేది వెలుగులోకి వస్తోంది.నిబంధనల ప్రకారం ప్రతి అమ్మకానికి బిల్లు తప్పనిసరి అయినప్పటికీ… ఎందుకు బిల్లులు ఇవ్వడం లేదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది .
మరోవైపు… రాత్రి 12 గంటల తర్వాత కూడా దాబాలు, కొన్ని బార్లు నడుపుతున్నారు .
చట్టం ప్రకారం సమయ పరిమితులు ఉన్నా… అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపడంతో యాక్సిడెంట్లు జరగడమే కాకుండా మహిళలను వేధించడం కుడి జరుగుతుంది. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే పార్కులు… బస్ స్టాండ్లు… రోడ్ల పక్కన… కాలనీల్లో… చెరువుల దగ్గర… గ్రామాల్లో కూడళ్ల వద్ద… మందుబాబులు గుంపులుగా కూర్చొని తాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇది కేవలం చట్టవిరుద్ధం మాత్రమే కాదు… సామాజిక సమస్యగా మారుతోంది.
మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
చిన్నపిల్లలు, మహిళలు తిరిగే ప్రాంతాల్లోనే బ్రాందీ షాపులు నడుస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి . ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల దగ్గర… దేవాలయాల పక్కన… జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల మధ్య…ఎక్సైజ్ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే…నాటు సారా ముప్పు మళ్లీ తలెత్తుతోందనే సమాచారం బయటకు వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా తయారీ చేసి … గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది …నాటు సారా తక్కువ ధరలకు విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నాటు సారా అనేది ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు… ప్రాణాలకు ముప్పు కూడా. గతంలో ఇలాంటి నాటు సారా తాగిన ఘటనల్లో ఎన్నో కుటుంబాలు దెబ్బతిన్నాయి. అయినా ఇప్పటికీ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు .ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు .



Total views : 61509