Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.

నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.

by CVR NEWS

నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు, అనామక టెలిగ్రామ్ ఛానెళ్లు.. అభ్యర్థుల నుంచి ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించింది NTA.

ఈ మోసాలతో పాటు, పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అప్‌లోడ్ చేసి, మెసేజ్‌ను ఎడిట్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు స్క్రీన్‌షాట్లు సృష్టించి పుకార్లు పుట్టిస్తున్నట్లు అధికారులు గమనించారు. ఈ ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, జూన్ 30 వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని కేంద్రం టెలిగ్రామ్ సంస్థను ఆదేశించినట్లు తెలుస్తుంది. సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, పరీక్షల పారదర్శకతను కాపాడటానికి, అభ్యర్థులు తప్పుడు పుకార్ల బారిన పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం అనివార్యమైందని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025196
Total views : 146667

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.