Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Film ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

by CVR NEWS
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్...

కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరి హారన్.వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.గాయత్రీ ప్రొడక్షన్స్, రచ్చమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రచ్చమల్ల శ్రీనివాస రావు నిర్మించిన ఈ చిత్రానికి పి.ఆర్. సంగీతం అందించారు.

ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు సాయి రాజేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ, “ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటీ, సవాళ్లు ఉంటాయి. నా తొలి చిత్రం హృదయ కాలేయం రోజులలో గెస్ట్ కోసం వెతికిన సందర్భాలు గుర్తొస్తున్నాయి. ఇదే వేదికపై బేబీ టీజర్, చెన్నై లవ్ స్టోరీ టీజర్‌లను కూడా విడుదల చేశాం. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత K.N రావు గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు పి.ఆర్. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు,” అని అన్నారు.

హీరోయిన్ రితిక మాట్లాడుతూ, “ముందుగా మా టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి మాకు అండగా నిలిచిన సాయి రాజేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, ‘శ్రీదేవి’ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన హరిహరన్ సర్, శేఖర్ సర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకమైనది. ‘ కళాంకి భైరవుడు’ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.

హీరో రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ, “మా చిన్న సినిమాకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన దర్శకుడు సాయి రాజేష్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శకుడు, నిర్మాతలపై నాకు ఎంతో గౌరవం ఉంది. వారు నాపై ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు పి.ఆర్. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఆయన సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. ‘ కళాంకి భైరవుడు’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.

హీరోయిన్ భవ్య శ్రీ మాట్లాడుతూ, “ముందుగా మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు, అలాగే మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి రాజేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. టీజర్‌కు లభించిన స్పందన చూసి ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌తో పాటు పూర్తి సినిమా కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు హరి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన అంకితభావం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ‘ కళాంకి భైరవుడు’ తప్పకుండా ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుంది. ప్రస్తుతం నేను శేఖర్ సర్, డీఓపీ అశోక్ సర్‌లతో కలిసి మరో చిత్రంలో కూడా పనిచేస్తున్నాను. వారితో మరోసారి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులందరూ ‘ కళాంకి భైరవుడు’ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.

నిర్మాత K.N రావు మాట్లాడుతూ, “మా చిత్రానికి మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దర్శకుడు హరిహరన్ గారు లేకపోతే ఈ సినిమా రూపుదిద్దుకునేది కాదు. ఆయన విజన్, కృషి వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది.‘ కళాంకి భైరవుడు’ చిత్రం చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో రూపొందింది. నిజ జీవితంలో జరిగిన అనేక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ కథను తెరకెక్కించాం. ఈ కథను రెండేళ్ల క్రితం విన్న వెంటనే నేను, మా సహ నిర్మాత శ్రీనివాస్ గారు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. సినిమా అవుట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. వచ్చే నెల 24వ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి, మీడియా మిత్రులు తమ వంతు సహకారంతో ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని అన్నారు.

సంగీత దర్శకుడు పి.ఆర్. మాట్లాడుతూ, “మా చిత్రానికి మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా టీజర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. టీజర్ మీకు నచ్చినట్లే మా సినిమా, పాటలు కూడా తప్పకుండా నచ్చుతాయని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి సంగీతం అందించడం నాకు ఎంతో మంచి అనుభవంగా నిలిచింది. చిత్రంలోని పాటలు, నేపథ్య సంగీతం కథకు మరింత బలం చేకూర్చేలా రూపొందించాం. ఎంతో నమ్మకంతో చెబుతున్నాను… ‘ కళాంకి భైరవుడు’ సినిమా ప్రతి వర్గం ప్రేక్షకులను అలరిస్తుంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.

దర్శకుడు హరిహరన్.V మాట్లాడుతూ , “సాయి రాజేష్ గారు చేసిన ఒక ఇంటర్వ్యూను చూసిన రోజు నుంచి ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. తన సినీ ప్రయాణం గురించి ఆయన చెప్పిన విధానం నన్నెంతో ప్రేరేపించింది. మా ‘ కళాంకి భైరవుడు’ చిత్రానికి మద్దతుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయి రాజేష్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న అనేక నిజ సంఘటనలే ఈ సినిమాను రూపొందించడానికి ప్రేరణగా నిలిచాయి. ఆ అనుభవాలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నాపై నమ్మకం ఉంచి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన మా హీరోకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన నమ్మకమే నాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ‘ కళాంకి భైరవుడు’ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025196
Total views : 146667

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.