Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.

భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.

by CVR NEWS
భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. తాజాగా ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్‌తో ప్రధాని మోదీని గౌరవించారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లగ్రిని చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, ప్రపంచ శాంతికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. తాజా పురస్కారంతో కలిపి, ప్రధాని మోదీ ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 33 అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకోవడం విశేషం. ఈ పురస్కారం కేవలం తనకు దక్కిన గౌరవం కాదని… 140 కోట్లకు పైగా ఉన్న భారత ప్రజల సామర్థ్యానికి… భారత్-స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి నిదర్శనం అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంతర్జాతీయ గౌరవం ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పింది.

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203024

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: