Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

by CVR NEWS

లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే లోక్‌సభలో కేవలం 15 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యల్ప ఉత్పాదకత నమోదైన లోక్‌సభ సమావేశాల్లో ఇది ఒకటిగా నిలిచింది.2004 నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే.. దీనికంటే తక్కువ ఉత్పాదకత కేవలం రెండు సమావేశాల్లో మాత్రమే నమోదైంది. 2010 శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ కేవలం 5 శాతం సమయం పనిచేయగా.. 2013 శీతాకాల సమావేశాల్లో 8 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయి.ఇక రాజ్యసభ నిర్ణయించిన సమయానికి 33 శాతం మాత్రమే పనిచేసినట్లు PRS గణాంకాలు చెబుతున్నాయి. అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించిన వివరాల్లో మాత్రం భిన్నమైన గణాంకాలు ఉన్నాయి. ఆయన ప్రకారం లోక్‌సభ 19 శాతం, రాజ్యసభ 39 శాతం సమయం పనిచేసింది.వర్షాకాల సమావేశాల సందర్భంగా పదేపదే రాజకీయ ఘర్షణలు, ప్రతిపక్షాల నిరసనలు, సభలో చోటుచేసుకున్న అంతరాయాలు చట్టసభ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ప్రజా సమస్యలు, కీలక అంశాలు, చట్టసభ వ్యవహారాలకు కేటాయించిన సమయం గణనీయంగా తగ్గిపోయింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: