Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh సింగరాయకొండలో మత్స్యకారులకు ట్రాన్స్‌పాండర్ల పంపిణీ.

సింగరాయకొండలో మత్స్యకారులకు ట్రాన్స్‌పాండర్ల పంపిణీ.

by CVR NEWS

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మత్స్యకారుల భద్రతకు కీలకమైన చర్యలు చేపట్టారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్‌పాండర్లను పంపిణీ చేశారు.ట్రాన్స్‌పాండర్ల ద్వారా సముద్రంలో ఉన్న పడవల ఆచూకీని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు.. తుఫాను హెచ్చరికలను ముందుగానే పొందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్ సందేశాలను పంపేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని.. సబ్సిడీపై వలలు, బోట్లు అందిస్తున్నామని తెలిపారు.వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని.. ప్రమాదాలకు గురైన బోట్లకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి లైఫ్ జాకెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: