అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు తాను భయపడలేదని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై తమకు నమ్మకం లేదని ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిపై సంపూర్ణ నియంత్రణ అమెరికాదేనని, అది తమ ఆధీనంలోనే ఉందని ప్రకటించారు. ఇరాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే కఠిన ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో ఒమన్ సమీపంలో ఓ కార్గో నౌకపై అమెరికా దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ రేవులపై దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. హర్మూజ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో పనామా కాల్వలో నౌకల రద్దీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి.
నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్
12
previous post