Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో హై అలర్ట్.

స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో హై అలర్ట్.

by CVR NEWS

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 వేడుకలకు ముందు భద్రతా చర్యలను ఢిల్లీ పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదా, ఖలిస్థానీ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్న వ్యక్తుల పోస్టర్లను పోలీసులు ప్రదర్శించారు. ఢిల్లీతో పాటు దేశ భద్రతకు ముప్పుగా భావిస్తున్న వ్యక్తులపై భద్రతా సంస్థలు, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చేయడమే ఈ పోస్టర్ల ఏర్పాటు ఉద్దేశమని పోలీసులు తెలిపారు.ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపడుతుంటారు. ఈసారి కూడా దేశ రాజధానిలో నిఘాను మరింత పెంచారు. సున్నిత ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన మౌలిక వసతుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేకంగా నిఘా కొనసాగుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: