హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఉన్న ట్రంప్ బ్రాండ్ తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. రెండు భారీ టవర్లతో నిర్మిస్తున్న ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నగర స్కైలైన్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా రూపుదిద్దుకుంటోంది. ఏకంగా 65 అంతస్తులు, సుమారు 245 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరుగుతుంది. మొత్తం 450 విలాసవంతమైన ఫ్లాట్లు అందుబాటులో ఉండగా.. వీటి ధరలు 5 కోట్ల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఫ్లాట్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో 16 పెంట్‌హౌస్‌లు ఉండగా.. వాటిలో 8 ఇప్పటికే అమ్ముడైనట్లు తెలుస్తోంది.
రెండు భారీ టవర్లతో ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. సుమారు 65 అంతస్తులు, 245 మీటర్ల ఎత్తు ఉండేలా టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో మొత్తం 450 విలాసవంతమైన ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ ప్రాజెక్ట్‌ను ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియల్టీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ట్రంప్ బ్రాండ్‌తో కలిసి చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో భారీ అంచనాలను పెంచుతోంది.
ట్రంప్ టవర్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నవి పెంట్‌హౌస్‌లు. మొత్తం 16 పెంట్‌హౌస్‌లు ఉండగా.. ఇప్పటికే 8 పెంట్‌హౌస్‌లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే మొత్తం పెంట్‌హౌస్‌లలో సగం ఇప్పటికే బుకింగ్ పూర్తయినట్లేగా తెలుస్తోంది. కోకాపేటలో వరుసగా భారీ లగ్జరీ ప్రాజెక్టులు వస్తుండటంతో.. ఈ ప్రాంతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరింత కీలకంగా మారుతోంది. ట్రంప్ బ్రాండ్ ఎంట్రీతో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హౌసింగ్‌కు హైదరాబాద్ మార్కెట్ మరింత చేరువవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.