దక్షిణ కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 బాంబర్‌గా గుర్తించారు. ఈ ఘటనలో 8 మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని మోజావే ఎడారిలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక అమెరికా వైమానిక దళ B-52 బాంబర్ విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో, అందులో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే మరణించినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. అణుఆయుధాలతో పాటు సాధారణ బాంబులను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ జెట్ విమానం… ఒక సాధారణ పరీక్షా మిషన్ కోసం బయలుదేరింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని… దీనిపై దర్యాప్తు జరుగుతోందని కల్నల్ జేమ్స్ హేస్ పేర్కొన్నారు.
అమెరికా : దక్షిణ కాలిఫోర్నియాలో కూలిన విమానం.
44
previous post




Total views : 146773