Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Devotional సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

by CVR NEWS

విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. పూజోత్సవాలు, అమ్మవారి దర్శనంతో సింహాచల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహాచలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: