Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

by CVR NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టయిన నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న ఆరు బంగారు గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు 26 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు తన సహచరులతో కలిసి రాత్రివేళ ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రిక్ వైర్ కట్టర్‌తో మహిళల మెడలోని బంగారు గొలుసులను కట్ చేసి అపహరించినట్లు ఎస్పీ వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: