Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

by CVR NEWS
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష ఘనంగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఆదిలాబాద్‌కు ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే పేరును తొలగించి, రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో జిల్లాకు ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాబోతున్నాయని ఆయన వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: