Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Film చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

by CVR NEWS

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా వీకెండ్ మాత్రమే కాకుండా, వర్కింగ్ డేస్‌లో సైతం బలమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది.

రామ్ చరణ్ కెరీర్‌లో సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం ‘పెద్ది’ కావడం. రెండో వారంలోనూ సినిమా అద్భుతమైన రన్ తో రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. అలాగే ప్రేక్షకులు ‘పెద్ది’ పాత్రతో ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో ఈ విజయం రుజువు చేసింది.

వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారత చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమా అద్భుతంగా రన్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది.

ఎమోషన్స్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా, పల్లెటూరి నేపథ్య కథనం వంటి అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ‘పెద్ది’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ పవర్‌ఫుల్ నటనకు తోడు బుచ్చిబాబు సానా అందించిన ఎమోషనల్ కథనం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ‘పెద్ది’ విజయయాత్ర ఇంకా కొనసాగుతూ రానున్న రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లతో కొత్త రికార్డులు సృష్టించనుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: