Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

by CVR NEWS
మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్

తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్‌ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నానని సవాల్‌ చేశారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్లు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలు ఆపలేరన్న మంత్రి లోకేష్‌..నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామన్నారు. బెంగళూరు- తాడేపల్లి- హైదరాబాద్ వీడి ఏపీ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందన్నారు. మహిళల్ని కించపరిచే వారిని, తిట్టేవారిని తన చుట్టూ పెట్టుకుంటారని విమర్శించారు లోకేష్‌. గుడివాడ అమర్‌నాథ్‌ అద్భుతంగా మాట్లాడారని జగన్ కితాబు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. భారతీరెడ్డిని, తన ఇద్దరు కుమార్తెలను హోం మంత్రిని అవమానించినట్లు అవమానిస్తే కూడా జగన్ శభాష్ అంటారా? అని ప్రశ్నించారు. టీడీపీది ఆ సంస్కృతి కాదు కాబట్టే జగన్ కుటుంబ సభ్యుల్ని కించపరిచిన వారిపైనా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి లోకేష్‌. స్థానిక ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. మంగళగిరి-నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: