Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

by CVR NEWS

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వేడుకల ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.ఆ తర్వాత పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన చంద్రబాబు… ఏపీఎస్పీ సహా వివిధ పోలీసు బలగాల సన్నద్ధతను సమీక్షించారు. పోలీసు దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్‌తో పాటు కర్ణాటక పోలీసు దళం నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు ప్రతీకగా, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఘనంగా సాగాయి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: