Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

by CVR NEWS
Earthquake

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు వెల్లడించాయి. ప్రధాన ప్రకంపనతో పాటు నిమిషాల వ్యవధిలోనే తదుపరి ఆఫర్ షాక్‌లు కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భూకంపం ధాటికి ఫ్లోర్స్ తీర ప్రాంతాలు, పరిసర పట్టణాల్లోని భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ప్రకంపనల తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సముద్ర గర్భంలో తక్కువ లోతులో సంభవించిన ఈ తీవ్ర భూకంపం వల్ల సముద్రంలో అలలు భారీగా ఎగసిపడే అవకాశం ఉండటంతో, ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ తీర ప్రాంత ప్రజలకు ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు తక్షణమే సురక్షితమైన, ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. సహాయక చర్యల కోసం రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు, ఇటీవల కొలంబియాలో సంభవించిన భూకంపం వల్ల 225 మందికి పైగా మరణించిన నేపథ్యంలో, ఈ తాజా ఇండోనేషియా ఘటనతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ముందస్తు రక్షణ చర్యలను అధికారులు వేగవంతం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: