Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

by CVR NEWS
ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికతతో పాటు ఇతర కీలక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టెక్ దిగ్గజం గూగుల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరుపక్షాల సమన్వయంతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ మరియు డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని గూగుల్‌ ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగానికి, ‘సంజీవని’ ప్రాజెక్టు అమలుకు సాంకేతిక భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర యువతకు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ రంగాలలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయి, రాష్ట్రంలో సప్లై చైన్ మరియు లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరరేఖ, పోర్టులు మరియు మెరుగైన కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను వివరిస్తూ పెట్టుబడులకు ఆహ్వానించారు. మరోవైపు, యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోనూ సమావేశమైన సీఎం, రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు చొరవ చూపారు. పట్టణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203023

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: