Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home International స్లోవేకియాలో పర్యటించిన ప్రధాని మోదీ.

స్లోవేకియాలో పర్యటించిన ప్రధాని మోదీ.

by CVR NEWS
భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం

ప్రధానిమోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. మొదట ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ.. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా లో అడుగుపెట్టి .. ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. స్లోవేకియాకు 1993లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. బ్రాటిస్లావా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ సంప్రదాయబద్ధంగా ‘బ్రెడ్ అండ్ సాల్ట్’తో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్-స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, అక్కడి అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1.6 బిలియన్ యూరోల వాణిజ్యం ఉంది. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల నేపథ్యంలో ఈయూ, నాటో సభ్యదేశమైన స్లోవేకియాతో బంధం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. స్లోవేకియా పర్యటన తర్వాత తిరిగి ప్రాన్స్ బయల్దేరిన మోదీ.. నేడు, రేపు ప్రాన్స్ లో జరిగే జీ7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం ‘వివాటెక్ 2026’ టెక్నాలజీ ఈవెంట్‌కు హాజరై ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025194
Total views : 146665

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.