Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home International మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ..

మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ..

by CVR NEWS
మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్

మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్.. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఆ మ్యాప్ వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన నేపాల్ ఎయిర్‌లైన్స్ నష్ట నివారణ చర్యలకు దిగింది. భారత్‌కు క్షమాపణలు చెప్పింది.మా సోషల్ మీడియా ఛానెళ్లలో ఇటీవల పంచుకున్న నెట్‌వర్క్ మ్యాప్‌లోని లోపానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని… ఆ మ్యాప్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి చాలా పెద్ద నిర్మాణ దోషాలు ఉన్నాయని… అవి నేపాల్, నేపాల్ ఎయిర్‌లైన్స్ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవు అని నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

 

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012372
Total views : 74852

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.