Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్‌శర్మకు ఐపీఎల్‌ షాక్..

సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్‌శర్మకు ఐపీఎల్‌ షాక్..

by CVR NEWS

టీమిండియా యువ ఆటగాడు, సన్‌ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు IPL నుంచి షాక్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. అయితే, ఏ సందర్భంలో అనేది ఐపీఎల్‌ కమిటీ వెల్లడించలేదు. కానీ, తన క్యాచ్‌ విషయంలోనే అభిషేక్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్‌లో ముజరబాని విసిరిన స్లో బంతిని భారీ షాట్‌ కోసం యత్నించాడు అభిషేక్. డీప్ స్క్వేర్‌ లెగ్‌ ఫీల్డర్ వరుణ్‌ చక్రవర్తి ఆ బంతిని పట్టుకున్నాడు. అయితే, ఆ క్యాచ్‌పై కాస్త అనుమానం ఉన్న ఫీల్డ్‌ అంపైర్లు దానిని థర్డ్‌ అంపైర్‌కు నివేదించారు. సమీక్షలో బంతిని వరుణ్‌ పట్టినట్లేనని భావించిన థర్డ్‌ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీనిపై అభిషేక్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ఏవో కామెంట్లు చేసుకుంటూ వెళ్లడంతో మ్యాచ్ రిఫరీ అతడికి జరిమానా విధించాడు. అభిషేక్‌ శర్మ ఆర్టికల్ 2.3 కిందకు వచ్చే లెవల్ 1 నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన దానిని స్వీకరించాడు. ఇక్కడ మ్యాచ్‌ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపీఎల్ స్పష్టం చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌తో అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో అతని ప్రవర్తన మాత్రం వివాదానికి దారితీసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: