Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Film “డాక్టర్ కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ లాంఛ్..

“డాక్టర్ కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ లాంఛ్..

by CVR NEWS

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్ తెలుగులో “డాక్టర్ కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవుతోంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్ తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి. ఈ రోజు ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

చిత్ర నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ – కోల్ కత్తా లో సంచలనం సృష్టించిన డాక్టర్ రేపు మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది. డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు ఆమె ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంటుంది. ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్ గా వుంటుంది. పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అన్నారు

నటి కవిత మాట్లాడుతూ – మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులోకి గోపాలకృష్ణ గారు ఆయన టీమ్ తీసుకొస్తోంది. యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్ లో ఒక డ్యూటీ డాక్టర్ కు ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు. షాజీ కైలాస్ గారు ఎంతో ప్రతిభ గల దర్శకులు. ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్ గా ప్రతి ఎలిమెంట్ బాగుంది. ఇలాంటి మూవీస్ ను పెద్ద ప్రొడ్యూసర్స్ పోటీపడి దక్కించుకుంటారు. ఈ పోటీలో గోపాలకృష్ణ గారు ఈ సినిమా దక్కించుకోవడం సంతోషకరం. గోపాలకృష్ణ గారికి, ఆయన శ్రీమతి స్వర్ణకుమారి గారికి మిగతా టీమ్ అందరికీ ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – గోపాలకృష్ణ గారు “డా.కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ అనే ఒక మంచి మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా చూశాను. నేను ఆ మూవీ చూస్తూ కథలో లీనమైపోయాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన మూవీ. ఈ మూవీ చూడగానే పీవీఆర్ వాళ్లు రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారంటే ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితమే. ఈ సినిమా గోపాలకృష్ణ గారికి సూపర్ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. అన్నారు.

లీగల్ అడ్వొకేట్ ప్రభాకర్ మాట్లాడుతూ – “డా.కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా గోపాలకృష్ణ గారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009318
Total views : 61414

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.