సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోంశాఖలో కానిస్టేబుళ్లుగా ఉన్న 358 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే న్యాయ శాఖలో 21 పోస్టులు కొత్తగా క్రియేట్ చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో మేనేజర్ పోస్టు కొత్తగా క్రియేట్ చేశామని ఆయన వివరించారు. పంచాయితీ రాజ్ శాఖలో 20 పోస్టులు సప్రస్ చేసి.. అవసరం ఉన్న చోట ఆ పోస్టులను క్రియేట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయింపులు చేయాల్సి వచ్చిందన్నారు మంత్రి.
ఆర్ అండ్ బికి సంబంధించి న్యూఢిల్లీలో కొత్తగా ఏపీ భవన్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తం 11.53 ఎకరాల్లో రూ.124.5 కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తామని వివరించారు. దీనిని ఎన్‌బీసీసీకి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ భవన నిర్మాణం ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని.. అందులో సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి పయ్యావుల తెలిపారు. కొత్త ఏపీ భవనానికి ఏదైనా మంచి పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు కోరారన్నారు. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పయ్యావుల తెలిపారు.. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో పాటు అమరావతిలోని సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నాకు.




Total views : 61763