Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..

గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..

by CVR NEWS
గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ

2027 మార్చి 31 నాటికి వ్యాపారాల అభివృద్ధి, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ అనే అంతర్జాతీయ వేదిక లోగోను అధికారికంగా ఆవిష్కరించారు . ఈ వేదిక ద్వారా తెలంగాణలోని వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు, స్టార్టప్‌లు, నిపుణులు అంతర్జాతీయ అవకాశాలను అన్వేషించి ప్రపంచ స్థాయిలో విస్తరించే అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎగుమతిదారులు, విద్యార్థులపై దృష్టి పెట్టి ప్రపంచ మార్కెట్లలో ప్రవేశం కల్పించేందుకు పలు దేశాల్లో ఎక్స్‌ప్లోరేటరీ మిషన్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రం ప్రస్తుతం సుమారు 19 బిలియన్‌ డాలర్లకు పైగా ఎగుమతులు సాధిస్తూ దేశంలో ప్రముఖంగా ఎదుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థికాభివృద్ధి దిశగా ఈ2ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలు వ్యాపారవేత్తలకు, ఎగుమతిదారులకు, యువతకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని తెలిపారు. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా నిలబెట్టడానికి కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్తున్నవారిని మంత్రి అభినందించారు. మొదటి అంతర్జాతీయ మిషన్ సింగపూర్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009385
Total views : 62181

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.