Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Film గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

by CVR NEWS

ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.

ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ అడిగిన ఒక ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయినట్లు సమాచారం. శ్రీను మాట్లాడుతూ “మేము కాపులం” అంటూ ఏదో సందర్భంలో స్పందించగా, ఆ వ్యాఖ్యపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “అలా మాట్లాడకూడదు” అంటూ జాఫర్ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం.

వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో గెటప్ శ్రీను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చేయను” అంటూ ఇంటర్వ్యూను మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం.

గెటప్ శ్రీను వెళ్లిపోయిన తర్వాత జాఫర్, “నేను ఏం తప్పుగా అడిగాను? ఎందుకు మీరు అంత సీరియస్ అవుతున్నారు?” అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏమిటి? ఇద్దరి మధ్య వివాదానికి అసలు కారణం ఏమిటి? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకు వస్తే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisements

You may also like

Our Visitor

027398
Total views : 152023

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.