కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ప్రజల ముంగిటకే పాలనను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రామచంద్రపురం గ్రామంలో కోటి 16 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో రోడ్లు మరియు భవనాల శాఖ ద్వారా 40 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని చెప్పారు. పందూర్ బ్రిడ్జి వంటి పెండింగ్ ప్రాజెక్టులను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని, స్టీల్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని హోం మంత్రి అనిత తెలిపారు.
పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
132
previous post