Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana బన్నీ ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు , వీఐపీలు

బన్నీ ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు , వీఐపీలు

by Rama
బన్నీ ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు , వీఐపీలు

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే రూ. 50 వేల పూచీకత్తుతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే, కోర్టు ఆర్డర్ కాపీ జైలుకు చేరడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాతంత్రా జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆర్డర్ కాపీలు రాగానే, అప్పటికే ఆయన న్యాయవాదులు సిద్ధం చేసి ఉంచిన ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా ఇంటికి చేరుకున్న బన్నీకి సినీ ప్రముఖులు పరామర్శలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాతలు, హీరోలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని పరామర్శిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: