డ్రోన్లను వినూత్నంగా ఉపయోగించేందుకు ఏపీ ప్రభుత్వం దేశం లోనే ఎక్కడా లేని విదంగా అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించింది.తాజాగా ఏపీ పోలీసులు గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయితీ జడిగూడ గ్రామ పరిధిలో గల అటవీ శాఖ భూముల్లో 15 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఎస్పి అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు గంజాయి తోటలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పెదబయలు మండలం వనభంగి పంచాయతీ జజిగూడ గ్రామ పరిధిలో గల అటవీ శాఖ భూముల్లో సాగు చేస్తున్నట్లు డ్రోన్ ల సహాయంతో గుర్తించారు.
ఈ మేరకు పెదబయలు ఎస్ఐ రమణ , అటవీశాఖ సెక్షన్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.పెదబయలు స్థానిక ఎస్సై రమణ మాట్లాడుతూ.. అక్రమంగా సాగు చేస్తున్న 18 మంది రైతులు గుట్టుగా గంజాయిని సాగు చేస్తున్నారని ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి దహనం చేసినట్టు తెలిపారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి