Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

by CVR NEWS

ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్‌గా అవతరించారు. ఎలాన్‌ మస్క్‌ సంపద సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. తాను స్థాపించిన రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ షేర్ల లిస్టింగ్‌తో ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ లక్ష కోట్ల డాలర్లు దాటేసింది. దాంతో ఆయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు. కనీసం లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తిని ట్రిలియనీర్‌ అంటారు. మిగతా సంపన్నులు ఈ ఘనతను సాధించేందుకు మరి కొన్నేళ్లు పట్టవచ్చు. ఎందుకంటే, బ్లూంబర్గ్‌ వరల్డ్‌ రిచ్‌ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్‌ నెట్‌వర్త్‌ 30,400 కోట్ల డాలర్లు. అంటే, మస్క్‌ సంపదలో మూడోవంతే. అంతేకాదు, ప్రపంచ టాప్‌-5 కుబేరుల్లోని మిగతా నలుగురి కంటే మస్క్‌ సంపదే అధికం. తైవాన్‌, ఐర్లాండ్‌, స్వీడన్‌ దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువే.

స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన వెంటనే స్పేస్‌ఎక్స్ షేర్లు భారీగా పెరగడంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ అయ్యారు. స్టాక్ మార్కెట్లోకి అలా, స్పేస్‌ఎక్స్ షేర్ల విడుదల మస్క్‌ను ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలబెట్టింది.స్పేస్‌ఎక్స్ షేర్లు ఓపెన్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించి, వెంటనే ఒక్కో షేరు సుమారు 150 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 15వేల రూపాయల ధరకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత షేరు ధర వేగంగా 160 డాలర్లకు పెరిగింది. స్పేస్‌ఎక్స్ పంచుకున్న అంచనా లిస్టింగ్ ధర 135 డాలర్లకంటే, షేర్లు 160 డాలర్లకు అంటే 18శాతం అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. షేరు విలువ 160 డాలర్లు దాటడంతో కంపెనీ మార్కెట్‌ విలువ కూడా 2 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించేసింది. ఒక దశలో 2.30 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దాంతో స్పేస్‌ఎక్స్‌లోని మస్క్‌ ఈక్విటీ వాటా విలువ 82,000 కోట్ల డాలర్లు దాటేసింది. తన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా వాటా విలువ 28,000 కోట్ల డాలర్లతో కలిపి మొత్తం నెట్‌వర్త్‌ 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: