Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

by CVR NEWS

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు, ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్స్‌ప్రెస్ వే, మూసీ ప్రక్షాళనతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు క్లియరెన్స్‌లపై ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తుల వర్షం కురిపించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాలు పెంపు, ఉపాధి కల్పన, ఆరోగ్యం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

 

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: