గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా షాడూ మట్టితో పర్యావరణ అనుకూల గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. చిన్నారులతో కలిసి విగ్రహాల తయారీలో పాల్గొన్న సీఎం.. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సంప్రదాయ పండుగలను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. వేలాది మంది చిన్నారులు సామూహికంగా షాడూ మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేశారు. పచ్చని, పరిశుభ్రమైన, సుస్థిరమైన మహారాష్ట్ర నిర్మాణమే లక్ష్యమని సీఎం ఫడ్నవీస్ పునరుద్ఘాటించారు. పర్యావరణ అవగాహనను సాంస్కృతిక సంప్రదాయాలతో మేళవించిన ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదై ప్రత్యేక గుర్తింపు పొందింది.
నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.
28
previous post