Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Crime మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

by CVR NEWS

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: