Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Telangana వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.

వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.

by CVR NEWS
వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ

డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR ఫంక్షన్ హాలు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. యువత డ్రగ్స్‌కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని ఎస్పీ సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

040023
Total views : 202988

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: