105
కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా విచిత్రంగా ప్రవర్తించింది. పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టి వదిలేశారు…. ఉన్నట్టుండి ఆ కుక్క చనిపోవడంతో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.. కుక్క మరణం సాధారణమైందా మరే కోణమేమైనా ఉన్నదా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు.



Total views : 202984