Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.

పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.

by CVR NEWS
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్

రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను ప్రశ్నించే ఐరోపా దేశాలు, తమ విక్రయించిన ఆయుధాలు భారత ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లి భారత్‌పైనే ఉపయోగించబడ్డ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఫిన్లాండ్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.అలాగే, భారత ప్రత్యర్థి దేశాలకు ఐరోపా దేశాలు ఆయుధాలు విక్రయించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, “భారత్‌ తయారుచేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడులు జరగలేదు. కానీ ఐరోపా దేశాలు విక్రయించిన ఆయుధాలు భారత్‌పై దాడులకు ఉపయోగించబడ్డాయి. ఇది ఇప్పుడే కాదు, చాలా కాలంగా జరుగుతోంది” అని పేర్కొన్నారు.భారత్‌ ఎప్పుడూ ఐరోపా భద్రతకు ముప్పుగా వ్యవహరించలేదని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని జైశంకర్ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023176
Total views : 141303

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.