Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

by CVR NEWS
కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో చివరి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రారంభమైన పనులు పూర్తికాని స్థితిలో ఉండగా, కలెక్టర్ చిత్రా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో మిగిలిన పనులు పూర్తి చేయించారని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతం చేయడం వల్ల భవనం సిద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. అదే కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు జాతీయ జెండా ఆవిష్కరణ కూడా జరుగుతుందని తెలిపారు.ప్రారంభం అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాలు అన్నీ కొత్త కలెక్టరేట్‌లోనే పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ భవనాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా జిల్లా అధికారుల నివాస గృహాలు ఇప్పటికే ఉన్నవి సరిపోతున్నాయని, వాటినే వినియోగిస్తామని తెలిపారు.మానేరు రివర్ ఫ్రంట్ రెండో దశ పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. డంప్ యార్డు తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు కూడా ఆయన వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: