129
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట బ్రిడ్జి సమీపంలో బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కంటైనర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను పునరుద్ధరించారు. ప్రమాద కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




Total views : 202972