Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక పర్యటన.

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక పర్యటన.

by CVR NEWS
గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక పర్యటన

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండ్రోజుల క్రితం ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు.. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే వ్యర్థాలు తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌, సిబ్బందిని మంత్రి ఆదేశించారు. అటువైపు వెళ్లిన మంత్రి.. వ్యర్థాలు తొలగించకపోవడాన్ని గమనించి మున్సిపల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను ఘటనాస్థలికి పిలిపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయని.. టెండర్‌ పిలిచి తొలగిస్తామని మున్సిపల్‌ సిబ్బంది సమాధానం చెప్పారు. మున్సిపాలిటీ జేసీబీ, ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండరా? అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవుపెట్టి వెళ్లండని హెచ్చరించారు. వ్యర్థాలు తొలగించే వరకు ఇక్కడే ఉంటానని కాల్వగట్టుపై ఉన్న బల్లపై కూర్చున్నారు. దీంతో హడావుడిగా అక్కడికి చేరుకున్న మున్సిపల్‌ యంత్రాంగం.. చెత్త తొలగింపు పనులు చేపట్టింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: