Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

by CVR NEWS
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీనాక్షి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. మీనాక్షి నటరాజన్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. వాడీవేడీగా వాదనలు జరిగాయి. నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న ఘటనలు గతంలో ఉన్నాయా అని పిటిషనర్‌ను సుప్రీం ప్రశ్నించింది. అలాంటి తీర్పులు ఉంటే కోర్టు ముందు పెట్టాలని సూచించింది. ఈ తీర్పుతో చాలా మంది ఇక నుంచి కేసులు వేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. వాదోపదావనల తర్వాత మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. అయితే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించింది. అక్కడా న్యాయం జరగకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023183
Total views : 141336

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.