Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

by CVR NEWS
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పార్కులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203022

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: